Vemulawada: వేములవాడ భీమేశ్వరుడిని దర్శించుకున్న పద్మా దేవేందర్ రెడ్డి

Vemulawada: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ దర్శించుకున్నారు.

BABU, VEMULAWADA
Published on: 16 Oct 2026 5:46 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ భీమేశ్వరుడిని దర్శించుకున్న పద్మా దేవేందర్ రెడ్డి

Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ లు తుల ఉమ, రాజన్నసిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు.

వారితో పాటు పలువురు మహిళా నాయకులు డాక్టర్ రమాదేవి, గంటల రేణుక, శాంతి నాయక్, అరుణ కొంగరి , అరుణ రెడ్డి, మమత, రజిత రావు, రాజ్యలక్ష్మి, చేరాల స్వాతి, చీటి సంధ్యారాణి, అనుచరులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA