Karimnagar: తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ ఫైర్
Karimnagar: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలకే తప్ప నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేరని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు.
Karimnagar: తిమ్మాపూర్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ ఫైర్
కరీంనగర్ జిల్లా: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కు ఎమ్మెల్యేగా ఉంటున్నారని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం లేదని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడ అభివృద్ధి జరగదో అక్కడ ఎమ్మెల్యేపై చర్చ జరుగుతుందని అది కేవలం మానకొండూరులోని జరుగుతుందని అన్నారు, 35 నెలల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీద సర్పంచుల మీద రాక్షసత్వం చూపిస్తున్నారని అన్నారు, నియోజకవర్గంలో ఏ ఒక్క మహిళా బిల్డింగ్ కట్టారా నిధులు తెచ్చినావా అని ప్రశ్నించారు.
మన్నెంపల్లి గ్రామ పాలకవర్గం అంతా ఆరు గుంటల భూమి ఇచ్చి మహిళా బిల్డింగ్ కోసం కలెక్టర్ కు నిధులు కావాలని కోరగా స్పందించిన కలెక్టర్ 10 లక్షల నిధులను మంజూరు చేశారని అన్నారు, రాజకీయ కక్షతోనే మన్నెంపల్లి గ్రామపంచాయతీ బిల్లింగ్ కుల్చారని, ఆ బిల్డింగ్ తో నీకేం పని అని ప్రశ్నించారు.
చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధి చేయాలని కోరారు, 35 నెలలుగా ఏం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు, రోడ్డు వేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని ఏ ఒక్క ఎమ్మెల్యే అనలేదని అది నీ చిత్తశుద్ధికే వదిలేస్తున్నామని అన్నారు, వెంటనే దీక్ష చేసి నియోజకవర్గంన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో
రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్,సర్పంచులు తాట్ల తిరుపతి, అవుదుర్తి రాంకిషన్ , ఎలుక ఆంజనేయులు, దుర్గం శ్రీనివాస్, నాయకులు నాయిని వెంకట్ రెడ్డి,పొన్నం అనిల్ గౌడ్ , మేకల మహేష్,గుజ్జుల ప్రణీత్ రెడ్డి , వంతడుపుల సంపత్,సుధాగోని సదయ్య,ఎడ్ల బుచ్చి రెడ్డి,పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, నగునూరి బాబు,బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




