Jagtial: ధాన్యం మార్కెట్‌ను తక్షణమే చల్గల్‌కు తరలించాలి.. జీవన్ రెడ్డి!

Jagtial: జగిత్యాల వ్యవసాయ మార్కెట్ వద్ద ధాన్యం ట్రాక్టర్ల క్యూతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ధాన్యం కేంద్రాన్ని తక్షణమే చల్గల్‌కు తరలించాలని మాజీ డిమాండ్ చేశారు.

ANAND, JAGITYAL
Published on: 23 Nov 2026 5:35 PM IST
Jagtial
X

Jagtial: ధాన్యం మార్కెట్‌ను తక్షణమే చల్గల్‌కు తరలించాలి.. జీవన్ రెడ్డి!

Jagtial: జగిత్యాల, పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ధాన్యం ట్రాక్టర్లు కొత్త బస్టాండ్ వరకు క్యూ కట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు.

ధాన్యం కేంద్రాన్ని చల్గల్‌కు తరలిస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఎందుకు తరలించలేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

మార్కెట్ నిర్వహించేది రైతుల కోసమా లేక అడ్తిదారుల కోసమా అని ఆయన నిలదీశారు. అడ్తిదారులు ఒప్పుకోవడం లేదనే కారణంతో తరలింపును నిలిపివేయడం తగదని, రైతులు పడుతున్న ఇబ్బందులకు మార్కెట్ కార్యదర్శి పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

రైతులు రోడ్లపై పడిగాపులు కాయకుండా తక్షణమే ధాన్యం మార్కెట్‌ను చల్గల్‌కు తరలించి, తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL