Karimnagar: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న యాదగిరి సునీల్ రావు

Karimnagar: కరీంనగర్‌ భగత్ నగర్, గోదాంగడ్డ దుర్గామాత మండపాలను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేసి, అన్నదానంలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 17 Oct 2026 4:58 PM IST
Karimnagar
X

Karimnagar: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న యాదగిరి సునీల్ రావు

కరీంనగర్: శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌ భగత్ నగర్ లోని పెద్దమ్మ యూత్ క్లబ్, గోదాంగడ్డ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వారు స్వయంగా పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దమ్మ యూత్ క్లబ్ సభ్యులు కుంభం అనిల్, రవి, శంకర్, సంజీవ్, కుంభం సంజయ్, సాయిరాం మరియు గణేష్ యూత్ సభ్యులు అందే మహేష్, పున్న లక్ష్మణ్, పున్న తిరుపతి, మారుపాక మల్లేశం, కనకయ్య, కొమురయ్య, ధర్మయ్య, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN