Sircilla: రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి.. జెల్ల వెంకటస్వామి!
Sircilla: భారత రాజ్యాంగం అందించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి పిలుపునిచ్చారు.
Sircilla: రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి.. జెల్ల వెంకటస్వామి!
Sircilla: భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలను అందించిందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, విద్యార్థులకు, యువతకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతో పాటు, తమ బాధ్యతలను కూడా నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకొని, విద్య ద్వారా ఉన్నత లక్ష్యాలను సాధిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సామాజిక పురోగతి కోసం బీసీ స్టడీ సర్కిల్ నిరంతరం కృషి చేస్తుందని జెల్ల వెంకటస్వామి తెలిపారు.




