Karimnagar: కరీంనగర్ కమీషనరేట్‌లో పోలీసులకు వ్యాసరచన పోటీలు!

Karimnagar: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమీషనరేట్‌లో సిబ్బందికి, అధికారులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 90 మంది ప్రతినిధులు హాజరు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 24 Oct 2026 8:22 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కమీషనరేట్‌లో పోలీసులకు వ్యాసరచన పోటీలు!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కమీషనరేట్‌లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు జరిగిన ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలు ఆశిస్తారు. లేదా "పోలీసు అధికారుల జీవితాలలో సోషల్ మీడియా పాత్ర దాన్ని వ్యసనాన్ని ఆదిగమించి వ్యక్తిగత సామాజిక ప్రయోజనాలకోసం సద్వినియోగం చేసుకోవడం ఎలా " అనే అంశంపై, నిర్వహించారు.

ఎస్సై మరియు ఆపై స్థాయి అధికారులకు "పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయవలసిన కృషి" లేదా "నేల స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం" అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమీషనరేట్‌కు చెందిన అన్ని పోలీసు స్టేషన్లు మరియు విభాగాల నుండి మొత్తం 90 మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN