Vemulawada: వేములవాడ భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం!
Vemulawada: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవాన్ని ఆలయ ఈవో రమాదేవి వైభవంగా ప్రారంభించారు; ముత్తైదువులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.
Vemulawada: వేములవాడ భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం!
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రముఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగుతోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీమతి రమాదేవి గారు ప్రారంభించారు.
ఈ కార్తీక మాస పర్వదినాలు 2026 నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 08వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ప్రతి రోజూ సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సుహాసినుల (ముత్తైదువుల) ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినులకు ఆలయ అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, వాయనంతో పాటు శ్రీ స్వామివారి దివ్య చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీమతి జయకుమారి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, శ్రీమతి రాధ, నూగురి నరేందర్, ఆలయ సిబ్బంది.




