Vemulawada: వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీని పర్యవేక్షించిన ఈవో!

Vemulawada: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీని ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ సోమవారం పర్యవేక్షించారు.

BABU, VEMULAWADA
Published on: 16 Nov 2026 4:47 PM IST
Vemulawada
X

Vemulawada: వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీని పర్యవేక్షించిన ఈవో!

​రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి , డీఈఓ శ్రీ ప్రతాప నవీన్ కుమార్ గార్లు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు కేటాయించారు. ఈ సందర్భంగా వారు కోడె క్యూలైన్లు, ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం క్యూలైన్లతో పాటు ఉచిత తాగునీటి వసతి, కార్తీక దీపాలు వెలిగించే ప్రదేశం, కోడె కట్టే స్తంభం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో శానిటేషన్ (పారిశుభ్రత) పనులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA