Yellareddypet: టపాసుల దుకాణాలతో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు!
Yellareddypet: ఎల్లారెడ్డిపేటలో దీపావళి పటాకుల దుకాణాల వద్ద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు పాటించాలని సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సూచించారు.
Yellareddypet: టపాసుల దుకాణాలతో ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు!
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేటలో దీపావళి పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక టపాసుల దుకాణాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సూచించారు.
గురువారం గ్రామంలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పంచాయతీ కార్యదర్శి, దుకాణాల నిర్వాహకులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ టపాసుల దుకాణాల ఏర్పాటు సమయంలో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, టపాసుల విక్రయ సమయంలో నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.




