Thangallapalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలి!
Thangallapalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం బద్దెనపల్లిలో సూచించారు.
Thangallapalli: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని వినియోగించుకోవాలి!
తంగళ్ళపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
పథకం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను గురువారం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఇప్పటివరకు నమోదైన దరఖాస్తుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం 561 కుటుంబాలకు గాను ఇప్పటివరకు 277 కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం ఆన్‌లైన్‌తో పాటు రిజిస్టర్లలో వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులైన కుటుంబాలకు పథకంపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రత్యేక శిబిరాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీమా పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలను అందించాలని, ప్రతి కేంద్రంలో లబ్ధిదారుల బీమా వివరాలతో పాటు నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఇన్చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.




