Sircilla: ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కలిసిన విద్యుత్ ఉద్యోగులు!

Sircilla: టీఎస్ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని 327–ఇంటక్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ నేతలు కలిసి ఉద్యోగుల పదోన్నతులు, సర్వీస్ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 7 Oct 2026 6:16 PM IST
Sircilla
X

Sircilla: ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కలిసిన విద్యుత్ ఉద్యోగులు!

సిరిసిల్ల: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్‌ (327–INTUC) నాయకులు హనుమకొండలోని టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థలోని వివిధ క్యాడర్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎండీకి వినతిపత్రం అందజేశారు.

అర్హత ఉన్న అన్ని క్యాడర్ల ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ సంబంధిత అంశాలను పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. అలాగే ఉద్యోగుల సంక్షేమం, పని ప్రదేశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారంపై సీఎండీతో సుదీర్ఘంగా చర్చించారు.

ఉద్యోగుల సమస్యలపై సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎండీ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ భేటీలో యూనియన్ అధ్యక్షుడు అనుముల మహేందర్, రీజినల్ సెక్రటరీ కె. అమరేందర్, చీఫ్ అడ్వైజర్ పి. ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి తిరుపతి, ట్రెజరర్ రమణా రెడ్డి, అడిషనల్ సెక్రటరీలు శ్రీనివాస్, సమీర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్వాల రవీందర్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA