Sircilla: కరెంటు ఉచ్చులు పెడితే పీడీ యాక్ట్ కేసులు.. సీఐ ఓ. వెంకటేష్!

Sircilla: పొలాల చుట్టూ కరెంటు తీగలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే పీడీ యాక్ట్ కేసులు తప్పవు. ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్ వార్నింగ్.

KALEEM, SIRICILLA
Published on: 3 Oct 2026 4:29 PM IST
Sircilla
X

Sircilla: కరెంటు ఉచ్చులు పెడితే పీడీ యాక్ట్ కేసులు.. సీఐ ఓ. వెంకటేష్!

Sircilla: అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు పొలాల చుట్టూ విద్యుత్ తీగలు, కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని ఎల్లారెడ్డిపేట సీఐ ఓ. వెంకటేష్ హెచ్చరించారు. కరెంటు షాకులతో ప్రాణనష్టం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

శనివారం గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఓ. వెంకటేష్ మాట్లాడుతూ.. అడవి జంతువుల బారి నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు, వేటగాళ్లు విద్యుత్ షాక్‌లు పెట్టడం చట్టవిరుద్ధమన్నారు. ఇలాంటి చర్యల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.

ఇటీవల గంభీరావుపేట మండల కేంద్రంలో పంట పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై దంపతులు గంట దేవయ్య, గంట లక్ష్మి మృతి చెందిన ఘటనను సీఐ గుర్తు చేశారు. ఇదే తరహా ఘటనలు కొనరావుపేట, రుద్రంగి మండలాల్లోనూ చోటుచేసుకున్నాయని తెలిపారు.

పంట పొలాల చుట్టూ, అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు లేదా కరెంటు ఉచ్చులు ఏర్పాటు చేసి ప్రమాదాలకు కారణమైతే.. ప్రాణనష్టం సంభవించిన సందర్భంలో మర్డర్ కేసుతో సమానంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఐ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేయవద్దని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA