Jagtial: జగిత్యాల జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం: ఈ-స్కూటర్ దగ్ధం!
Jagtial: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కదిలే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అకస్మాత్తుగా మంటలు. తక్షణమే దిగిపోవడంతో క్షేమంగా బయటపడ్డ కుటుంబం.
Jagtial: జగిత్యాల జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం: ఈ-స్కూటర్ దగ్ధం!
Jagtial: జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇబ్రహీంపట్నం మండలం గోదూరు శివారులో ప్రయాణంలో ఉండగానే ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా దగ్ధమైంది. అప్రమత్తమైన యజమాని కుటుంబంతో సహా కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. పూర్తి వివరాలు మన ప్రతినిధి అందిస్తారు.
మెట్టుపల్లి నుంచి వర్షకొండకు కుటుంబ సభ్యులతో కలిసి రాము అనే వ్యక్తి ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో గోదూరు శివారు ప్రాంతానికి చేరుకోగానే, స్కూటర్ బ్యాటరీ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని రాము గమనించారు.
క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి, కుటుంబ సభ్యులను సురక్షితంగా కిందకు దించారు. వారు దూరంగా వెళ్లిన క్షణాల్లోనే స్కూటర్‌కు పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి, చూస్తుండగానే పూర్తిగా కాలి బూడిదైంది. సకాలంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని, కుటుంబమంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ స్పందనతో ప్రాణాపాయం తప్పడం ఊరటనిచ్చే అంశం. అయితే వరుసగా జరుగుతున్న ఇలాంటి ఈ-స్కూటర్ అగ్నిప్రమాదాలపై సంబంధిత కంపెనీలు, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.




