Mettupally: రోడ్డు దాటుతుండగా కాళ్లపైకి దూసుకెళ్లిన బస్సు.. వృద్ధురాలి పరిస్థితి విషమం!
Mettupally: మెట్టుపల్లి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Mettupally: రోడ్డు దాటుతుండగా కాళ్లపైకి దూసుకెళ్లిన బస్సు.. వృద్ధురాలి పరిస్థితి విషమం!
మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఒక దారుణ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలి కాళ్లపై నుండి RTC బస్సు వెళ్లడంతో ఆమెకు రెండు కాళ్లు విరిగి తీవ్రగాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించడంతో, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




