Mustabad: తెర్లుమద్దిలో దాడి ఘటనపై విచారణ చేపట్టిన డీఎస్పీ నాగేంద్ర చారి
Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో డీజే వివాదంలో జరిగిన దాడిపై సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.
Mustabad: తెర్లుమద్దిలో దాడి ఘటనపై విచారణ చేపట్టిన డీఎస్పీ నాగేంద్ర చారి
రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో దాడి ఘటనపై సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి విచారణ చేపట్టారు. అక్టోబర్ 20న రాత్రి గ్రామంలోని బొడ్రాయి వద్ద డీజే నిర్వహిస్తుండగా, దానిని ఆపాలని కోరినందుకు తనపై, తన భార్యపై, తన అన్నపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారని గ్రామానికి చెందిన కొమ్మట మధు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై బాధితుడు అక్టోబర్ 23న ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై జ్యోతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెర్లుమద్ది గ్రామానికి చేరుకుని కేసుకు సంబంధించిన వివరాలపై విచారణ చేపట్టారు.




