Manthani: రైతుల విషయంలో రాజకీయం చేయొద్దు: కుడుదుల వెంకన్న

Manthani: రైతుల విషయంలో రాజకీయం చేయొద్దని, ప్రైవేట్ వ్యాపారులు కొనని ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంథని ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న తెలిపారు.

SHANKAR, MANTHANI
Published on: 12 Nov 2026 4:31 PM IST
Manthani
X

Manthani: రైతుల విషయంలో రాజకీయం చేయొద్దు: కుడుదుల వెంకన్న

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయం మార్కెట్ యార్డులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ.... రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని విమర్శించారు. వ్యవసాయం చేసిన వారికే రైతుల కష్టాలు, సమస్యలు, వ్యవసాయం విలువ తెలుస్తాయని అన్నారు.

మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఇటీవలే వరి ధాన్యాన్ని తీసుకువచ్చి పోశారని, మద్దతు ధర కంటే ఎక్కువ ధర లభిస్తే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే మంథని మండల పరిధిలో సుమారు 180 లారీల ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యాపారులు, దళారులు కొనుగోలు చేయని ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెంకన్న తెలిపారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన వెంటనే సీఎండీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి అదనపు విద్యుత్ సరఫరా చేయించారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న స్పష్టం చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI