Peddapalli: ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను శాలువాతో సత్కరించిన మున్సిపల్ కౌన్సిలర్లు!

Peddapalli: పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.2 లక్షలు ఖర్చయ్యే గర్భకోశ చికిత్సను వైద్యులు ఉచితంగా అందించారు.

RAJU, PEDDAPALLI
Published on: 25 Nov 2026 1:22 PM IST
Peddapalli
X

Peddapalli: ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను శాలువాతో సత్కరించిన మున్సిపల్ కౌన్సిలర్లు!

Peddapalli: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.గోదావరిఖనికి చెందిన సునీత గర్భకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు, ఆధునిక చికిత్సలు అందిస్తున్నారని తెలుసుకున్న ఆమె ఆసుపత్రికి వచ్చి వైద్యులను సంప్రదించారు. దీంతో వైద్యులు ఆమెకు అవసరమైన పరీక్షలు నిర్వహించి సకాలంలో సరైన చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడింది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యే చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించడంతో సునీత ఆనందం వ్యక్తం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తున్న వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తుండటంపై హర్షం వ్యక్తం చేసిన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని, పేద ప్రజలకు ఇది ఎంతో ప్రయోజనకరమని వారు పేర్కొన్నారు.మొత్తానికి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తూ పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రజల నమ్మకాన్ని చూరగొంటోంది.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI