Sircilla: ఒక కంటికి బదులు మరో కంటికి సర్జరీ.. కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు!

Sircilla: సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో ఘోర తప్పిదం జరిగింది. ఎడమ కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా కుడి కంటికి చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Oct 2026 5:44 PM IST
Sircilla
X

Sircilla: ఒక కంటికి బదులు మరో కంటికి సర్జరీ.. కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో సర్జరీ విషయంలో పొరపాటు జరిగింది. ఎంకమ్మకు ఎడమ కంటికి సర్జరీ చేయాల్సి ఉండగా.. కుడి కంటికి సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విషయం గుర్తించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

ఎంకమ్మకు ఎడమ కంటికి సర్జరీ చేయాల్సి ఉందని ముందుగానే నిర్ధారించి.. అందుకు సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు కుటుంబ సభ్యులకు వివరించారు. అయితే సర్జరీ పూర్తయిన తర్వాత కుడి కంటికి ఆపరేషన్ జరిగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.

సర్జరీకి ముందు ఏ కంటికి ఆపరేషన్ చేయాలో నిర్ధారించినప్పటికీ.. ఈ పొరపాటు ఎలా జరిగిందనే అంశంపై కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పేషెంట్‌కు సంబంధించిన సర్జరీ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA