Palakurthy: సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దు!
Palakurthy: ఎలకలపల్లి-కన్నాల డబుల్ రోడ్డు పనుల కోసం సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దని రాణాపూర్ సర్పంచ్ పాలకుర్తి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Palakurthy: సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వొద్దు!
పాలకుర్తి: పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలకలపల్లి నుంచి కన్నాల వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనుల్లో భాగంగా రాణాపూర్ ఐకేపీ సెంటర్ సమీపంలోని సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు ఇవ్వవద్దని కోరుతూ రాణాపూర్ సర్పంచ్ ఇటుకల స్రవంతి శ్రీకాంత్ పాలకుర్తి మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ)కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సమ్మక్క గుట్ట నుంచి మట్టి తరలింపునకు అనుమతులు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు. వినతిపత్రంపై స్పందించిన తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.




