Sircilla: సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఘటనపై వైద్యారోగ్య శాఖ విచారణ!

Sircilla: సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఎడమ కంటికి బదులు కుడి కంటికి శస్త్రచికిత్స చేసిన ఘటనపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 10:00 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఘటనపై వైద్యారోగ్య శాఖ విచారణ!

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలో ఎడమ కంటికి బదులుగా కుడి కంటికి శస్త్రచికిత్స చేసినట్లు వచ్చిన వార్తపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించిన అధికారులు, సంబంధిత ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా అంధత్వ నియంత్రణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయీం జహా, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వైద్యులతో కలిసి సంబంధిత కేసును పరిశీలించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు అధికారులు తెలిపారు.

ఆసుపత్రి యాజమాన్యం నుంచి అందిన వివరణను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు.

రోగులకు శస్త్రచికిత్స చేసే ముందు వారి ఆరోగ్య పరిస్థితి, నిర్వహించాల్సిన శస్త్రచికిత్స, సంబంధిత కంటి వివరాలు, చికిత్సా విధానం గురించి స్పష్టంగా వివరించి, వారి సమ్మతి పొందడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోగుల భద్రత, వైద్య సేవల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆమె స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA