Sircilla: ఈ నెల 8న ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు: అదనపు కలెక్టర్ నగేష్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 8న ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ని ఘనంగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
Sircilla: ఈ నెల 8న ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు: అదనపు కలెక్టర్ నగేష్!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 8వ తేదీన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ముందు గోడలపై ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ లోగో స్టిక్కర్ను అతికించి, లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలని సూచించారు.
లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ఎదుట దీపం వెలిగించి, ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ద్వారా ఫొటోలు తీసుకోవాలని తెలిపారు. ఆ ఫొటోలను లబ్ధిదారులు లేదా వారి కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో ఇల్లు నిర్మాణానికి ముందు, నిర్మాణం పూర్తయిన తర్వాత ఉన్న పరిస్థితులను చూపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తమ పరిధిలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గుర్తించి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజాప్రతినిధులు, హౌసింగ్ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది ఇందిరమ్మ గృహ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పూర్తయిన ఇళ్లను సందర్శించాలని, లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనాలని అదనపు కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఇన్చార్జి హౌసింగ్ పీడీ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.




