Sircilla: సిరిసిల్లలో ఘనంగా జిల్లా యువజన ఉత్సవాలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో ఘనంగా జిల్లా యువజన ఉత్సవాలు. 400 మంది విద్యార్థుల ప్రదర్శనలు, విజేతలకు బహుమతుల అందజేత.
Sircilla: సిరిసిల్లలో ఘనంగా జిల్లా యువజన ఉత్సవాలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన ఉత్సవాలను శుక్రవారం (నవంబర్ 6) ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అనుమతితో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
యువతలోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, సాంకేతిక ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో కల్చరల్ ట్రాక్, పీపీపీ ఛాలెంజ్ ట్రాక్ పోటీలను నిర్వహించారు. కల్చరల్ ట్రాక్‌లో భాగంగా జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, కవిత్వం, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్, నుక్కడ్ నాటక్ పోటీలు నిర్వహించారు. పీపీపీ ఛాలెంజ్ ట్రాక్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ ఫ్యూచర్ రెడీనెస్ అనే అంశంపై పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, కౌన్సిలర్ ఆడె చంద్రికల్లా ప్రభాకర్ హాజరయ్యారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఇంటర్మీడియట్ బోర్డు అధికారి సురేష్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హనుమంత్ పాల్గొన్నారు.
వివిధ పాఠశాలల నుంచి వచ్చిన బాల్‌రెడ్డి, డి. ప్రభాకర్, ఎస్. బాబు, బి. అనూష యశస్విని, గడ్డం శంకర్, కపిల నరేష్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
పోటీల్లో విజేతలు
జానపద నృత్య ప్రదర్శనలో బీజేఆర్ అగ్రికల్చర్ కళాశాల ప్రథమ బహుమతి సాధించగా, ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ద్వితీయ బహుమతి పొందింది. జానపద గేయాల విభాగంలో ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ప్రథమ, బీజేఆర్ అగ్రికల్చర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచాయి.
నుక్కడ్ నాటక్ ప్రదర్శనలో బీజేఆర్ అగ్రికల్చర్ కళాశాల ప్రథమ బహుమతి, ఈఎంఆర్ఎస్ ఎల్లారెడ్డిపేట ద్వితీయ బహుమతి గెలుచుకున్నాయి. పెయింటింగ్ విభాగంలో గౌట్ నర్సింగ్ కళాశాలకు చెందిన ముస్కాన్ ప్రథమ బహుమతి, రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థి ఎల్. రోహిత్ ద్వితీయ బహుమతి సాధించారు.
పీపీపీ ఛాలెంజ్ ట్రాక్‌లో కేజీబీవీ వేములవాడ అర్బన్‌కు చెందిన అక్షయ మాధవి ప్రథమ బహుమతి గెలుచుకోగా, బీజేఆర్ అగ్రికల్చర్ కళాశాలకు చెందిన షేక్ ఫరాజ్, ఎస్. సాత్విక్ ద్వితీయ బహుమతి సాధించారు.
వివిధ పోటీల్లో విజేతలకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ బహుమతులు అందజేశారు. జిల్లా యువజన ఉత్సవాలు విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికితీసేందుకు వేదికగా నిలిచాయి.




