Sircilla: సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన సిరిసిల్ల వ్యవసాయ అధికారి!

Sircilla: అఖిల భారత సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో ప్రతిభ చాటి షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమ స్థానం సాధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం.

KALEEM, SIRICILLA
Published on: 9 Oct 2026 2:30 PM IST
Sircilla
X

Sircilla: సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన సిరిసిల్ల వ్యవసాయ అధికారి!

Sircilla: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 7న నిర్వహించిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ప్రతిభ చాటారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పాల్గొని రెండు విభాగాల్లోనూ ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీలకు ఆమె ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయిలో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికైన అఫ్జల్ బేగంను జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ. రాందాస్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA