Dharmapuri: ధర్మపురి లక్ష్మీనరసింహుని ఆలయంలో అనంత దీపోత్సవం!

Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దీపావళి పురస్కరించుకుని అనంత దీపోత్సవం, అద్దాల మండపంలో లక్ష్మీ పూజ వైభవంగా నిర్వహించారు.

RAMESH, DHARMPURI
Published on: 9 Nov 2026 8:15 PM IST
Dharmapuri
X

Dharmapuri: ధర్మపురి లక్ష్మీనరసింహుని ఆలయంలో అనంత దీపోత్సవం!

ధర్మపురి: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దీపావళి సందర్భంగా. స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళల్లో ప్రధాన దేవాలయంలోని అభిషేక మండపంలో అనంత దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే అద్దాల మండపంలో శ్రీ అమ్మవారికి లక్ష్మీ సూక్తంతో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.

RAMESH, DHARMPURI

RAMESH, DHARMPURI