Dharmapuri: దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిన బ్రహ్మపుష్కరిణి!
Dharmapuri: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి బ్రహ్మపుష్కరిణిలో మంగళవారం పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.
Dharmapuri: దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిన బ్రహ్మపుష్కరిణి!
Dharmapuri: పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో కన్నుల పండువగా జరిగింది...సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మపుష్కరిణి (కోనేరు) లో సాయంత్రం వేళ పంచ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రతి ఏడు వలె శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దీపాలంకరణ కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగుతుండటం సాంప్రదాయం కాగా, కార్తీక మాసం పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ సందర్భంగా బ్రహ్మపుష్కరిణి మధ్యలో గల మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి రూపాలను ఉంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు బ్రహ్మపుష్కరిణిలో ఏర్పాటు చేసిన 5 వేల మట్టి ప్రమిదలలో నూనె పోసి దీపాలను వెలిగించారు.
దీపాల కాంతులతో బ్రహ్మపుష్కరిణి దేదీప్యమానంగా వెలిగిపోయింది.




