Jammikunta: ఆబాది మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అన్నపూజ!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని ఆబాది శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఖమ్మం భక్తులు భక్తిశ్రద్ధలతో అన్నపూజ నిర్వహించారు.
Jammikunta: ఆబాది మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో అన్నపూజ!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది గ్రామంలో అతి పురాణమైన శివాలయం పేరుగాంచిన ఆలయంలో కార్తీక మాసమున సోమవారం రోజున మంచి పర్వదినం రోజు కాబట్టి ఖమ్మం వాస్తవ్యులు గోవిందం పవన్ కుమార్ సుభాషిణి, లక్ష్మీ రిషిత, నాగ సాయి హేమాన్ష్, నరెడ్ల మంజుల కుటుంబ సభ్యులు స్వామివారికి అన్నపూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని భక్తులు ఆకాంక్షించారు. ఆలయంలో భక్తితో అన్నపూజ నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.




