Thimmapur: కార్తీక పౌర్ణమి సందర్భంగా తిమ్మాపూర్ మండల ఆలయాలకు పోటెత్తిన భక్తులు!
Thimmapur: కార్తీక పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని శ్రీ గిరిజ మృత్యుంజయ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Thimmapur: కార్తీక పౌర్ణమి సందర్భంగా తిమ్మాపూర్ మండల ఆలయాలకు పోటెత్తిన భక్తులు!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలంలోని ఆలయాలలో కార్తిక పౌర్ణమి పర్వదినాన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్ఎండి కాలనీ లోగల శ్రీ గిరిజ మృత్యుంజయ ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.
తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా వేకువ జాంనుండే ఆలయంలో అభిషేకాలు , పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్తీక పౌర్ణమి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున శివారాధన, దీపారాధన చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివ నామస్మరణతో ఆలయాలు మారు మోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ చల్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు,బట్టు కరుణాకర్ లు అన్నీ ఏర్పాట్లను చేశారు.




