Jagtial: కార్తీక పౌర్ణమి వేళ కోటిలింగాల ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Jagtial: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Sowmya
Published on: 24 Nov 2026 12:51 PM IST
Jagtial
X

Jagtial: కార్తీక పౌర్ణమి వేళ కోటిలింగాల ఆలయానికి పోటెత్తిన భక్తులు!

Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు,పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Sowmya

Sowmya