Peddapalli: ఓదెల మల్లన్న అగ్నిగుండంలో పడ్డ భక్తుడు తప్పిన పెను ప్రమాదం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయ అగ్నిగుండ మహోత్సవంలో అపశృతి. నిప్పుల గుండంలో పడిపోయిన శివశక్తి భక్తుడు.. గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం.
Peddapalli: ఓదెల మల్లన్న అగ్నిగుండంలో పడ్డ భక్తుడు తప్పిన పెను ప్రమాదం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ అగ్నిగుండ మహోత్సవంలో గురువారం ఒక అపశృతి చోటుచేసుకుంది. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులలో, అగ్నిగుండం దాటుతున్న క్రమంలో ఓ శివశక్తి భక్తుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఒక్కసారిగా భక్తుడు నిప్పుల గుండంలో పడటంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే దైవకృప వల్ల సదరు భక్తునికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ఆలయ అధికారులు, భక్తులు ప్రశాంతత వ్యక్తం చేశారు.
Next Story




