Karimnagar: పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం: మేయర్
Karimnagar: పార్టీలకు అతీతంగా కరీంనగర్ను అభివృద్ధి చేస్తున్నామని, 38వ డివిజన్లో రూ.24 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
Karimnagar: పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం: మేయర్
కరీంనగర్: విలీన గ్రామాలు శివారు ప్రాంతాల డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా తమ పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శుక్రవారం 38 వ డివిజన్ లో పర్యటించారు.
అమీరనగర్ లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ దేవసాని సరస్వతి సత్యనారాయణ తో కలిసి నగరపాలక సంస్థ కు చెందిన 24 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం డివిజన్ లో పలు సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. చేపట్టిన పనులను వేగవంతంగా నాణ్యత తో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు.
అనంతరం డివిజన్ లోని దుర్గమాత మండపాన్ని సందర్శించి... డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అతిథులుగా వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్ కు మండప నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో మా పాలకవర్గం డివిజన్ల లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మమ్మారంగా చేపడుతుందని తెలిపారు. 38 వ డివిజన్ లో కార్పోరేటర్ మా దృష్ఠికి తెచ్చిన సమస్యను పరిష్కరించేలా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇప్పటికే డివిజన్ యూఐడీఎఫ్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావల్సి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ ను అర్బన్ చాలేంజ్ ఫండ్ స్కింలో చేర్చి... 840 కోట్ల నిధులు తెచ్చామని... త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీస్కుంటున్నామని తెలిపారు. పాలకవర్గం ఏర్పిడితే పని చేస్తామని ప్రజలకు ఇట్టిన మాట ప్రకారం గడిచిన 7 నెలల కాలం కోట్ల రూపాయల నిధులతో డివిజన్ల లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
బండి సంజయ్ కుమార్ సహకారం తో 50 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో డివిజన్ల లో పనులు చేపట్టామని...మరో 30 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తెచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లోనే కరీంనగర్ నగరపాలక సంస్థ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి... మాడల్ సిటీగా మార్చుతామని తెలిపారు. ప్రధానంగా డంపింగ్ యార్డు సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. స్వచ్చ భారత్ మిషన్ కింద 17 కోట్ల బయోమైనింగ్ ప్రక్రియ పనులకు కేటాయించామని... త్వరలోనే పనులు ప్రారంభం చేసి స్థానిక ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మాసం గణేష్, కేఏపిపి చంద్ర, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




