Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకలు!
Karimnagar: కరీంనగర్‌లో వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు 2K వాకథాన్‌ను ప్రారంభించారు.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకలు!
Karimnagar: నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలని, తద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో, ఆరోగ్య పరిరక్షణతో పాటు గత 40 సంవత్సరాలుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్ 40వ వసంతాల వేడుకలు ఆదివారం కరీంనగర్‌లో అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని '2K వాకథాన్'ను ప్రారంభించారు.
నగర వీధుల్లో ఉత్సాహంగా 2K వాకథాన్..
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం నుండి పాత కలెక్టరేట్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ‘2K వాకథాన్’కు నగరవాసుల నుండి విశేష స్పందన లభించింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వందలాది మంది వాకర్స్ ఉత్సాహంగా అడుగులు వేయడంతో నగర వీధులన్నీ సందడిగా మారాయి. ఆరోగ్య అవగాహన నినాదాలు, ప్లకార్డులతో సాగిన ఈ ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. వాకథాన్ ముగింపు అనంతరం పాత కలెక్టరేట్ ఆడిటోరియంలో 40వ వసంతాల వేడుకల సంబరాలు, ఉత్తమ సేవలందించిన వారికి అవార్డుల ప్రదానోత్సవం చేశారు.
సమాజానికి వాకర్స్ సేవలు ఆదర్శం..
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో, వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి 40వ వాకర్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున 2K వాకథాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుండి వందలాది సంఖ్యలో వాకర్స్ సభ్యులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు.
మారుతున్న ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ వాకింగ్‌ను తమ దినచర్యగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం లేదా సాయంత్రం మనకు అనుకూలమైన సమయంలో చేసుకునే ఏకైక వ్యాయామం వాకింగ్ మాత్రమేనని అన్నారు. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమై, ఆరోగ్యం పూర్తి స్థాయిలో మన నియంత్రణలో ఉంటుందని పేర్కొన్నారు. మనం వాకింగ్ అలవాటు చేసుకోవడంతో పాటు, మన మిత్రులకు, చుట్టుపక్కల వారికి కూడా దీనిపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
ఇంటర్నేషనల్ వాకర్స్ 304 డిస్ట్రిక్ట్ ఏర్పాటు కోసం సుధాకర్ రావు, వారి మిత్రబృందం నాలుగైదు సంవత్సరాల పాటు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. నేడు ఈ సంస్థ ద్వారా కేవలం ఆరోగ్య పరిరక్షణే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం గొప్ప విషయమని కొనియాడారు. కరీంనగర్ జిల్లాలోని వాకర్స్ సభ్యులందరూ మీమీ ప్రాంతాల్లో కొత్త వాకింగ్ క్లబ్‌లను ప్రారంభించి, మరింత మందిని సభ్యులుగా చేర్చుకుంటూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కరీంనగర్‌లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, డిస్ట్రిక్ట్ గవర్నర్ సుధాకర్ రావుకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్లాటినం డోనర్, ఏవీపీ ఏరియా-3 వాకర్ ఎస్. మురళీ కృష్ణ, రీజియన్ కౌన్సిలర్-12 వాకర్ పి. ఎల్ల గౌడ్, ప్లాటినం డోనర్,కరీంనగర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 304 వాకర్ అన్నమనేని సుధాకర్ రావు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ వాకర్ గుడిపాటి రమణారెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ వాకర్ గొట్టిముక్కుల రవీందర్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ వాకర్ మిల్కూరి సమ్మి రెడ్డి, డిస్ట్రిక్ట్ పి.ఆర్.ఓ వాకర్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్లు, డిప్యూటీ గవర్నర్లు మరియు ఆర్‌సీలు, జెడ్‌సీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, బులెటిన్ ఎడిటర్లు, పెద్ద సంఖ్యలో వాకర్స్ క్లబ్స్ - డిస్ట్రిక్ట్ 304 సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




