Peddapalli: హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు..ఆర్డీవోకు బాధితుడి ఫిర్యాదు!
Peddapalli: పెద్దపల్లిలో సీడీపీవోగా పనిచేసి మృతిచెందిన శోభారాణి సర్వీస్ బుక్ కోసం హైకోర్టు ఆర్డర్ తెచ్చినా పట్టించుకోవడం లేదని ఆర్డీవోకు ఆమె కుమారుడు కరుణాకర్ ఫిర్యాదు.
Peddapalli: హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు..ఆర్డీవోకు బాధితుడి ఫిర్యాదు!
Peddapalli: పెద్దపల్లి సిడిపివో కార్యాలయంలో ఏ సిడిపివో గా విధులు నిర్వహించిన శోభారాణి అనారోగ్యం తో మృతి చెందగా సర్వీస్ బుక్ కావాలని అడుగుతున్న ఇబ్బందులు పెడుతున్నారని, హై కోర్టు ఆర్డర్ తెచ్చిన పట్టించుకోవడం లేదని ఆమె కుమారుడు కరుణాకర్ ఆర్డీవో కు ఫిర్యాదు చేశారు.
గత కొన్ని ఏళ్లుగా తిరుగుతున్న కూడా సర్వీస్ బుక్ ఇవ్వడం లేదని , ఇవ్వాలంటే 15 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు. అప్పటికి సిడిపివో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సుల్తాన్ కు 5 లక్షలు ఇచ్చానని మిగతా 10 లక్షలు ఇస్తేనే సర్వీస్ బుక్ ఇస్తానని పేర్కొంటున్నట్లు తెలిపారు. దీనిపై జిల్లా అధికారుల కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఇప్పటి కైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు.




