Karimnagar: దానంపై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: బండి సంజయ్

Karimnagar: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్య విజయమని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 18 Sept 2026 8:28 PM IST
Karimnagar
X

Karimnagar: దానంపై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయం: బండి సంజయ్

కరీంనగర్: శాసన వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న కాంగ్రెస్ కు చెంప పెట్టు అని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

శాసన వ్యవస్థ విచక్షణాధికారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పీకర్ తలొగ్గడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. శాసనసభ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు,పట్టపగలు దేశమంతా చూస్తుండగా హత్య చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం ఎంత తప్పో ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడం అంతే తప్పు అని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ/శాసన వ్యవస్థే అత్యున్నతం..

శాసన వ్యవస్థే పక్షపాతంగా వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అనివార్యంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని సరిదిద్దుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థలనే ధ్వంసం చేసేందుకు వెనుకాడటం లేదనేది తేట తెల్లమైందిని చెప్పారు. ఇకనైనా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా శాసనసభ స్పీకర్ వ్యవహరించాలని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అన్నారు.

రాజ్యాంగ బుక్ ను పట్టుకుని షో చేసినంత మాత్రాన రాహుల్ గాంధీ రాజ్యంగ పరిరక్షకుడు కాలేరు,

రాజ్యాంగం ఏం చెబుతుందో దానిని అనుసరించాలనే సోయిండాలి కదా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ పై ఒత్తిడి తెచ్చి శాసనసభ పరువు తీస్తుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు.

శాసనసభ వ్యవస్థను కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులంతా ముందుకు రావాలి, అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR