Manthani: జాతీయ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి శివకుమార్‌కు ఘన సన్మానం!
Manthani: హైదరాబాద్‌లో జరిగిన జాతీయ రోడ్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ విద్యార్థి శివకుమార్‌కు అభినందనలు.
Manthani: జాతీయ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి శివకుమార్‌కు ఘన సన్మానం!
Manthani: తెలంగాణ సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 13న హైదరాబాద్‌లో నిర్వహించిన రోడ్ జాతీయ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని కంఫర్ట్ గ్రామర్ పాఠశాలకు చెందిన విద్యార్థి కొంతం శివకుమార్ ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు.
ఈ సందర్భంగా రాజాపూర్ భక్త ఆంజనేయస్వామి దేవాలయ ధర్మకర్త ముకుంద రాజన్న, కొట్టే సత్తయ్య శివకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి సైక్లింగ్‌లో చూపిన ప్రతిభను వారు ప్రశంసించారు.




