Karimnagar: వయోవృద్ధులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన!

Karimnagar: కరీంనగర్‌లో వయోవృద్ధులకు సైబర్ నేరాలపై అవగాహన డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ మోసాలపై డీడబ్ల్యూవో సరస్వతి, సైబర్ క్రైమ్ ఎస్ఐ జ్యోత్స్న సూచనలు.. టోల్ ఫ్రీ 1930పై అవగాహన.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Sept 2026 8:04 PM IST
Karimnagar
X

Karimnagar: వయోవృద్ధులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన!

కరీంనగర్: అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని కరీంనగర్ లోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వయోవృద్దులు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్ట్ తదితర మోసాలపై జాగ్రత్తగా ఉండాలని కోరారు.

అనంతరం జ్యోత్స్న, ఎస్. ఐ., సైబర్ క్రైమ్ బ్రాంచ్ మాట్లాడుతూ వయోవృద్ధులు ఓటీపీ, ఏటీఎం పిన్, సీవీవీ, పాస్‌వర్డ్, యూపీఐ పిన్ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘాల అధ్యక్షులు రామేశం, మోసం అంజయ్య, సత్యనారాయణ, రాధ, వయోవృద్దులు మరియు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN