Karimnagar: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ముగిసిన 'సీఆర్ఐ 37 సీజన్-2' టోర్నీ!

Karimnagar: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన 'సీఆర్ఐ 37 సీజన్-2' క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మేయర్ కొలగాని శ్రీనివాస్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Nov 2026 8:23 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ముగిసిన 'సీఆర్ఐ 37 సీజన్-2' టోర్నీ!

కరీంనగర్: క్రీకేట్ టోర్నమెంట్లు స్థానిక క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఎంతగానో దోహదపడతాయని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలో కోడూరి రవీందర్ గౌడ్ స్మారకార్థం, కార్పొరేటర్ పిపిఏ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సీఆర్ఐ 37 సీజన్-2’ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఆదివారం అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి.

ఈ ముగింపు వేడుకలకు, విజేతల ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమానికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ పోరులో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా తలపడగా, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి ఛాంపియన్‌గా నిలిచిన విజేత జట్టుకు మేయర్ కొలగాని శ్రీనివాస్ తన చేతుల మీదుగా ట్రోఫీ కప్‌తో పాటు రూ. 15,000 నగదు బహుమతిని అందజేశారు. అలాగే, పోటీలో గట్టి పోటీనిచ్చి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 10,000 నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా క్రీడలు ఎంతో దోహద పడుతాయని అన్నారు. నషాముక్త్ భారత్ సశగా యువత క్రీడల పై ఆసక్తిని పెంచుకోవాలని... పిలుపు నిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు కోడూరి రవీంధర్ గౌడ్ స్మారకార్ధం కార్పోరేటర్ పిపిఏ చంద్ర ఆద్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో క్రికేట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు.

యవత క్రీడల్లో రాణించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. ప్రధానంగా యువత క్రికేట్ క్రీడ పై అధిక ఆసక్తి చూపించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్ వల్ల క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఆటలు దోహదపడుతాయని తెలిపారు. టోర్నీలో అత్యుత్తమ బ్యాంకింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శించిన క్రీడాకారులకు ప్రత్యేక అభినంధనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ భ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, జీఎంజీవో అధ్యక్షులు ధారం శ్రీనివాస్, కార్పోరేటర్లు రేణుక శ్రీనివాస్, తోట అనిల్, పలువురు క్రీడా సంఘాల నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN