Karimnagar: మోహన్ రెడ్డి మరణం తీరని లోటు: సీపీఎం
Karimnagar: సీపీఎం సీనియర్ నాయకులు, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నేత ఎడవెల్లి మోహన్ రెడ్డి క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని సీపీఎం సంతాపం తెలిపింది.
Karimnagar: మోహన్ రెడ్డి మరణం తీరని లోటు: సీపీఎం
కరీంనగర్: సిపిఎం సీనియర్ నాయకులు, ఆర్టీసీ SWF కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, ఎడవెల్లి మోహన్ రెడ్డి అకాల మరణం ఉద్యమానికి తీరనిలోటు అని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు.
మోహన్ రెడ్డి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. సీతారాంపూర్ లోని వారి స్వగృహంలో మోహన్ రెడ్డి పార్టివ దేహం పై సీపీఎం జెండా కప్పి, పూలమాలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ మోహన్ రెడ్డి 1991,1999, ఆర్టీసీలో జోనల్ సమ్మె, 2021, 2025 రాష్ట్ర సమ్మెలలో కీలకపాత్ర వహించారని, కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మిక సంఘం నిర్మాణంలో కీలక పాత్ర వహించి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. మోహన్ రెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. వారి సతీమణి ఎడవెల్లి విజయకు,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పుల్లెల మల్లయ్య, ఆర్టీసీ SWF రాష్ట్ర నాయకులు వీ.ఎస్ రావు,CITU ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, ఆర్టీసీ SWF నాయకులు శ్రీనివాస్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.




