Karimnagar: కరీంనగర్‌లో విచ్చలవిడిగా భూ కబ్జాలు: సీపీఐ ఆగ్రహం!

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని CPI జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 Oct 2026 3:41 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో విచ్చలవిడిగా భూ కబ్జాలు: సీపీఐ ఆగ్రహం!

కరీంనగర్: కరీంనగర్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు మరియు ప్రైవేట్ వ్యక్తుల భూములను కబ్జాలు చేస్తున్న వారిపై అటు అధికార యంత్రాంగం ఇటు పోలీసులు ఉక్కుపాదం మోపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్,నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.

గత కొంత కాలంగా కరీంనగర్ నగరంతో పాటు చుట్టుప్రక్కల విలీన గ్రామాల్లో నివాస యోగ్యానికి ఉపయోగపడే ప్రభుత్వ భూములను కొంత మంది రాజకీయ నాయకులు,ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు కబ్జాలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పట్టా భూములను కబ్జాలు చేస్తూ పట్టాదారులను,కొనుగోలు దారులను భయబ్రాంతులకు గురిచేయడం,డబ్బులు వసూలు చేయడం లాంటివి జరుగుతున్నాయని,కబ్జా దారుల వెనుక ప్రజా ప్రతినిధుల హస్తం కూడా ఉండడంతో విచ్చల విడిగా భూ కబ్జా దారులు చెలరేగిపోతున్నారని అలాంటి వారిని గుర్తించి అధికారులు,పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు.

కనీసం ఉండడానికి ఇండ్లు లేని ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయని వారికి ఇండ్ల స్థలాలతో ఇవ్వడానికి ప్రభుత్వ భూములు ఉండవు కానీ ప్రభుత్వ భూములు కబ్జా కోరుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయో అర్థం కావడం లేదని,ఇందులో అధికారుల పాత్ర కూడా ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల కబ్జాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వంపై ప్రజల నుండి పెద్ద ఎత్తున తిరుబాటు తప్పదని శ్రీనివాస్,సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN