Sircilla: గంభీరావుపేటలో విషాదం విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పంట పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.

KALEEM, SIRICILLA
Published on: 2 Oct 2026 10:33 AM IST
Sircilla
X

Sircilla: గంభీరావుపేటలో విషాదం విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై గంభీరావుపేటకు చెందిన దంపతులు గంట దేవయ్య, గంట లక్ష్మి మృతిచెందారు. పంట పొలం వద్ద ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం. పొలానికి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ షాక్‌కు గురైన దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. దంపతుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనతో గంభీరావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA