Peddapalli: పెద్దపల్లిలో బతుకమ్మ సంబరాలకు డీజే బాక్సుల పంపిణీ!
Peddapalli: పెద్దపల్లి 17వ వార్డులో బతుకమ్మ పండుగ పురస్కరించుకుని మహిళలకు డీజే బాక్సులు, యాంప్లిఫైయర్లు పంపిణీ చేసిన కౌన్సిలర్ తోట ఫణీంద్ర భూపతి (గుట్టు).
Peddapalli: పెద్దపల్లిలో బతుకమ్మ సంబరాలకు డీజే బాక్సుల పంపిణీ!
Peddapalli: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని 17వ వార్డులో కౌన్సిలర్ తోట ఫణీంద్ర భూపతి (గుట్టు) ఆధ్వర్యంలో మహిళలకు డీజే బాక్సులు, యాంప్లిఫైయర్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ అంటే మహిళల పండుగ అని, మహిళలను మరింత ఉత్సాహపరిచేందుకే ఈ ఏర్పాట్లు చేశామని కౌన్సిలర్ తెలిపారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ తోట ఫణీంద్ర భూపతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, చైర్మన్ నూగిల్ల మల్లయ్య ఆధ్వర్యంలో ప్రతి పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
2ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాకేష్,సంపత్ రాజు, అర్జున్,గణేష్, విక్కీ, శివ, సంతోష్, మహిళలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




