Jammikunta: జమ్మికుంటలో క్వింటా పత్తి ధర రూ.9,040
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి గరిష్ట ధర రూ.9,040 పలికింది; అర్ణబ్ తుఫాన్ కారణంగా మార్కెట్కు 3 రోజులు సెలవు ప్రకటించారు.
Jammikunta: జమ్మికుంటలో క్వింటా పత్తి ధర రూ.9,040
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పత్తి మార్కెట్ యార్డుకు 87 వాహనాల్లో పత్తిని రైతులు తీసుకువచ్చారు మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలుకుతుండటంతో పత్తిని అమ్మడానికి రైతులు మార్కెట్ తరలించారు. పత్తికి మద్దతు ధర ప్రస్తుతం. 8667 ఉండగా నేడు అత్యధికంగా 9040 ల ధర మధ్య ధర 8850 పలికింది.
గరిష్ట ధర 8400 రైతులు తీసుకొచ్చిన వాహనాల పత్తికి ఖరీదార్లు మిల్లర్లు ధర పలికారు దగ్గరుండి మార్కెట్ చైర్ పర్సన్ కొల్లూరి సప్న సదానందం వైస్ చైర్మన్ సత్య రెడ్డి డైరెక్టర్లు సూర్య శ్రీపతి రెడ్డి మార్కెట్ కార్యదర్శి మల్లేశం గ్రేట్ టు రాజు. వెంబడి ఉండి రైతులకు ధరలు పెట్టించారు.
మార్కెట్లో పత్తి వెలం జరుగుతున్న టైంలో పెద్దపల్లి జిల్లా జాజీరిపల్లి గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య మార్కెట్ యార్డులో తాను తీసుకొచ్చిన పత్తి ట్రాక్టర్ నుండి కిందికి దిగే తరుణం లో ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి.దీంతో రైతును ఆసుపత్రికి మార్కెట్ చైర్ పర్సన్.వైస్ చైర్మన్. డైరెక్టర్లు. కార్యదర్శి అధికారులు.108 ద్వారా హాస్పిటల్ కు తరలించారు.
ప్రమాదం ఏమి లేదు అని డాక్టర్ల అన్నారు మార్కెట్కు శుక్రవారం సెలవు కావాలని ఖరీదార్లు మిల్లర్స్ అర్ణబ్ తుఫాన్ వల్ల పత్తిని కొనలేమని సెలవు కావాలని వినతిపత్రం అందజేసినారు చైర్మన్ కు పై అధికారికి తెలియజేసినారు. శనివారం ఆదివారం సెలవులు అర్ణభ్ తుఫాన్ వల్ల రైతులకు ఇబ్బంది అయితది కాబట్టి చెప్పడంతో సెలవు ప్రకటించారు.
రైతులు కూడా పత్తి తేమతో వస్తది కాబట్టి ఇబ్బంది పడద్దని సోమారం నాడు పత్తిని మార్కెట్ కు తీసుకురావాలి మార్కెట్ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం వైస్ చైర్మన్ మార్కెట్ కార్యదర్శి రైతులకు తెలియజేశారు.




