Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అటవీ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా రాయకల్‌దేవ్‌పల్లిలో అటవీ, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి వేట వలలు, ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు.

RAJU, PEDDAPALLI
Published on: 6 Oct 2026 2:59 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అటవీ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా అటవీ అధికారి (DFO) ఆదేశాల మేరకు మంగళవారం ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాయకల్‌దేవ్‌పల్లి గ్రామంలో,Range పెద్దపల్లి, మంథని అటవీ రేంజ్‌లకు చెందిన అటవీ సిబ్బంది, స్థానిక ఎలిగేడు పోలీసుల సహకారంతో సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, దాడులు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా అధికారులు 8 వేట వలలు, 14 ఉచ్చులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్థులకు వన్యప్రాణుల వారోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా FRO టి. సతీష్ కుమార్ మాట్లాడుతూ, చెట్లను అక్రమంగా నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరాలని హెచ్చరించారు. అటవీ వనరులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అక్రమంగా వేట లేదా వన్యప్రాణుల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు: టి. సతీష్ కుమార్ (పెద్దపల్లి FRO), ఎం. వినయ్ నాయక్ (మంథని FRO).

డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు: పి. దేవదాస్, ఎన్. రమేష్, జె. తిరుపతి, జి. కొమురయ్య.

సెక్షన్ ఆఫీసర్లు: ఎస్.పి. సతీష్ కుమార్, ఎం. నరసయ్య, ఎస్.డి. రహిమతుల్లా, ఎం.డి. అమీర్‌ఉద్దీన్, ముదస్సర్ షా ఖాన్.

బీట్ ఆఫీసర్లు: జి. రామమూర్తి, కె. పవన్ కుమార్, ఎస్. ప్రదీప్, కె. తిరుపతి, పి. రంజిత, ఎం.డి. అక్తర్ పాషా.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI