Peddapalli: గంగారంలో రావణాసురుడి ప్రతిమకు ఇందిరమ్మ చీరల వినియోగంపై వివాదం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా గంగారంలో రావణ దహనం ప్రతిమ తయారీకి ఇందిరమ్మ చీరలను వినియోగించడంపై వివాదం. స్పందించిన స్థానికులు, రాజకీయ వర్గాలు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 21 Oct 2026 9:46 AM IST
Peddapalli
X

Peddapalli: గంగారంలో రావణాసురుడి ప్రతిమకు ఇందిరమ్మ చీరల వినియోగంపై వివాదం!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో విజయదశమి పండగ సందర్భంగా రావణ దహనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ‘గరుడ యూత్’ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు.

​ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి-రఘు ముఖ్య అతిథిగా హాజరై శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యూత్ సభ్యులతో కలిసి రావణ వధ, రావణ దహన ఘట్టాలను అత్యంత ఉత్సాహంగా జరిపారు.

​వివాదాస్పదంగా మారిన నిర్మాణం:

రావణ దహనం కోసం తయారు చేసిన భారీ రావణాసురుడి ప్రతిమ కింది భాగాన్ని కప్పేందుకు ‘ఇందిరమ్మ చీరలను’ వినియోగించడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం పంపిణీకి ఉద్దేశించిన ఇందిరమ్మ చీరలను ఇలా రావణ దహన కార్యక్రమం కోసం వాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై గ్రామస్తులు మరియు స్థానిక రాజకీయ వర్గాల మధ్య చర్చ తీవ్ర రూపం దాల్చింది.

​ఈ కార్యక్రమంలో గరుడ యూత్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli