Karimnagar: నిత్యావసరాల ధరలు తగ్గించాలి: సీపీఎం వాసుదేవరెడ్డి
Karimnagar: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, బీపీఎల్ కుటుంబాలకు 14 రకాల సరుకులు ఉచితంగా ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
Karimnagar: నిత్యావసరాల ధరలు తగ్గించాలి: సీపీఎం వాసుదేవరెడ్డి
కరీంనగర్: ఎల్ నినో ప్రభావాన్ని సాకుగా చూపి వ్యాపారులు నిత్యవసర వస్తువులను పెద్ద ఎత్తున బ్లాక్ చేస్తూ విపరీతమైన ధరలను పెంచారని, పెంచిన ధరలను తగ్గించి, ధరలను నియంత్రించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్ లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యవసర వస్తువులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు నిర్వహించి నిత్యవసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
రేషన్ షాపుల ద్వారా పేద కుటుంబాలకు 14 రకాల నిత్యవసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీపై సరుకులు అందించాలన్నారు.
జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి కొనుగోళ్ళు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రజలను ఆదుకోవడం కోసం జిల్లాకు కేంద్ర ప్రభుత్వం 2000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, నిధులు వెంటనే విడుదల చేయాలని అన్నారు.
వాణిజ్య పంటలకు ఎకరానికి 50,000, ఇతర పంటలకు 30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో ఎంపీ బండి సంజయ్ పూర్తిగా విఫలమైనాడన్నారు. కరువు నివారణ చర్యలు తీసుకొని, రైతాంగాన్ని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునుటి శ్రీనివాస్, డి నరేష్ పటేల్, నాయకులు గజ్జల శ్రీకాంత్ పాల్గొన్నారు.




