Yellareddypet: రాగట్లపల్లి పంచాయతీలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం!

Yellareddypet: రాగట్లపల్లి గ్రామపంచాయతీలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం. రాజ్యాంగ విలువలను కాపాడాలని సర్పంచ్ నెతేట్ల లాసయ్య పిలుపు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 12:53 PM IST
Yellareddypet
X

Yellareddypet: రాగట్లపల్లి పంచాయతీలో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమం!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాగట్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నెతేట్ల లాసయ్య, ఉపసర్పంచ్ మందాటి రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చెరుకు నవీన్, దాసరి రేఖ, గ్రామపంచాయతీ కార్యదర్శి బండారి సారిక తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA