Manakondur: కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే కవ్వంపల్లి

Manakondur: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 25 Oct 2026 4:34 PM IST
Manakondur
X

Manakondur: కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం: ఎమ్మెల్యే కవ్వంపల్లి

కరీంనగర్ జిల్లా: మానకొండూర్ చెరువుకట్ట వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తో కలసి మార్కెట్ కమిటీ పాలక వర్గం పూల మాల వేసి ర్యాలీగా మార్కెట్ యార్డ్ కి చేరుకున్నారు. అనంతరం మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లతో జిల్లా మార్కెటింగ్ అధికారీ షాబొద్ధిన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులను అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆనాడు రైతులకు ఉచిత కరెంటు, కొనుగోలు కేంద్రాలను వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంబిస్తే నేడు వాటిని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందన్నారు. ఇవి రైతులకు వరంగా మారాయని అన్నారు. రైతును రాజు చేయడానికి రేవంత్ సర్కారు కురిచేస్తుందన్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి సర్కారు చేసిందన్నారు.

రైతులకు సబ్సిడీపై యంత్రాలను, విత్తనాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తే, ఇపుడు డిమాండ్ ఎంతో పెరిగింది అన్నారు. రైతు కళ్లలో సంతోషాన్ని చూస్తున్నట్లు తెలిపారు. రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇపుడు పదవులు ఇవ్వడం కత్తి మీద సాములా ఉన్నదని, ఎస్టి వర్గానికి రిజర్వుడ్ కావడంతో రాజలింగంకి ఇస్తూ. అన్ని వర్గాలకు సమాన స్థానం కల్పించినట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

రైతులు వారికి సహకరించాలని కోరారు. రైతు కుటుంబం నుండివచ్చిన రేవంత్ రెడ్డి రైతు ప్రభుత్వం అందిస్తున్నట్లు, రైతులను రాజులు చేయాలని ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. నూతన ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గాన్ని రైతులు ఆశీర్వదించాలని కోరారు. రైతు సంక్షేమం కోసం పాలకవర్గం కష్టపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయ్ కుమార్, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మోరపెల్లి రమణా రెడ్డి,గోపు మల్లారెడ్డి,ఒగ్గు దామోదర్, పులి కృష్ణ, వినయ్, ఎర్రల కవిత, తమ్మిశెట్టి రాజేష్, రేపాక రాజేశ్వర్, కుంభం చిరంజీవి, ముత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల సంపత్ రెడ్డి, సతీష్ కుమార్,కొండ్ర సురేష్, తదితరులు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU