Sircilla: ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఘన నివాళులర్పించారు.
Sircilla: ఇందిరాగాంధీ జయంతి వేడుకలు.. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు మాట్లాడుతూ.. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేశారని పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకురాలని అన్నారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. సిద్దిపేటలో నిర్వహించే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి గడ్డం నరసయ్య, బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చాడెపు చంద్రకళ, కౌన్సిలర్లు కూరపాటి శ్రీశైలం,
బొద్దుల శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు, వెంగళ లక్ష్మీ నరసయ్య, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొప్ప దేవయ్య, ప్రధాన కార్యదర్శి నీలి రవీందర్, మాజీ పట్టణ అధ్యక్షుడు పత్తిపాక లక్ష్మీరాజు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె. రియాజ్‌తో పాటు పట్టణ కాంగ్రెస్ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




