Korutla: నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం జువ్వాడి: కాంగ్రెస్ నేతల నివాళి!
Korutla: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 99వ జయంతి సందర్భంగా కోరుట్లలో కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి.
Korutla: నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనం జువ్వాడి: కాంగ్రెస్ నేతల నివాళి!
కోరుట్ల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 99వ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని వెటర్నరీ కళాశాల వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగారావు, సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జువ్వాడి రత్నాకర్ రావు నిస్వార్థ రాజకీయాలకు, క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. తిమ్మాపూర్ సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించి, మెట్‌పల్లి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారని గుర్తుచేసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా 'ధూప దీప నైవేద్య పథకం' ప్రవేశపెట్టి అర్చకుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. అలాగే కోరుట్లలో వెటర్నరీ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు వేలాది ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం ఆయన స్మారకార్థం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నాయకులు ప్రారంభించారు.




