Metpally: మెట్టుపల్లిలో రాజకీయం వేడెక్కించిన మున్సిపల్ కార్మికుల వివాదం!

Metpally: కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Updated on: 10 Nov 2026 12:50 PM IST
Metpally
X

Metpally: మెట్టుపల్లిలో రాజకీయం వేడెక్కించిన మున్సిపల్ కార్మికుల వివాదం!

Metpally: కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెట్టుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల పారిశుద్ధ్య పనుల కోసం కేటాయించిన మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తమ సొంత ఇంటి పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటున్న ఎమ్మెల్యేకి పనివాళ్లను పెట్టుకునే స్థోమత లేదా అని ప్రశ్నించారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మరియు కల్వకుంట్ల కుటుంబం తీరుపై మెట్టుపల్లి కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు నిప్పులు చెరిగారు. మెట్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదన్నారు.

​గతంలో మాజీ ఎమ్మెల్యే 6 మంది మున్సిపల్ సిబ్బందిని తమ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని, కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో అధికారులు వారిని తొలగించారని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ ఇంటి పన్ను చెల్లించారా అని నిలదీశారు.​

ఎమ్మెల్యేగా నెలకు 2.50 లక్షల రూపాయల జీతం తీసుకుంటూ కూడా మళ్లీ ఇప్పుడు ఇద్దరు మున్సిపల్ కార్మికులను సొంత పనులకు ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులకు ఉపయోగించాల్సిన మున్సిపల్ సిబ్బందిని సొంత పనులకు ఎలా వాడుకుంటారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ​100 ఎకరాల భూములు ఉన్న కోరుట్ల నియోజకవర్గ కల్వకుంట్ల కుటుంబానికి, పనివాళ్లకు నెలకు 30 వేల రూపాయల జీతం ఇచ్చేంత స్థోమత లేదా అని ఎద్దేవా చేశారు.

​సొంత పనులకు వాడుకుంటున్న మున్సిపల్ సిబ్బందిని తక్షణమే మున్సిపాలిటీకి అప్పగించాలని, ఇన్ని రోజులు ఆ కార్మికులతో చేయించుకున్న పనిదినాల జీతం డబ్బులను తిరిగి మున్సిపాలిటీ ఖాతాలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మున్సిపల్ సిబ్బందిని దుర్వినియోగం చేసినందుకుగాను మెట్టుపల్లి ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జువ్వాడి కృష్ణారావు స్పష్టం చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA