Gaddivanipally: మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం: ప్రణవ్
Gaddivanipally: ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి, భోగంపాడు గ్రామాల్లో గురువారం వొడితల ప్రణవ్ నూతన వివో భవనాలను ప్రారంభించి మహిళా సంఘాలకు సముచిత స్థానం ఇస్తున్నామన్నారు.
Gaddivanipally: మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం: ప్రణవ్
Gaddivanipally: గడ్డివాని పల్లి, భోగంపాడు గ్రామాల్లో నూతన్ వివో బిల్డింగ్ లను ప్రారంభించిన ప్రణవ్.మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మహిళ సంఘాల వారికి,వారి సమావేశాలకు ఇబ్బందులు కలగకుండా వివో బిల్డింగ్ లు చాలా ఉపయోగపడతాయని,ఇందిరమ్మ పుట్టిన రోజు సందర్భంగా గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఇల్లందకుంట మండల పరిధిలోని గడ్డివానిపల్లి,భోగంపాడు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన వివో భవనాలను కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘాల నాయకురాల్లతో ముచ్చటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళల ప్రాధాన్యతగాఇస్తున్నామని,సంక్షేమంతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,గ్రామ సర్పంచులు,ఇల్లందకుంట మండల కాంగ్రెస్పార్టీనాయకులు,నాయకురాల్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




